లేటెస్ట్ పోస్టర్: సావిత్రి మళ్లీ పుట్టినట్లు ఉంది!

Saturday, May 5th, 2018, 09:43:35 PM IST


అలనాటి అందాల తార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న మహానటి సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా టికెట్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలా వరకు కొన్ని థియేటర్స్ లో మొదటి రోజు అన్ని షోల టికెట్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోన్న పోస్టర్స్ సినిమాపై ఎంతగానో ఆసక్తిని రేపుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో సావిత్రి మాయాబజార్ లోని లుక్ కి తగ్గట్టుగా కీర్తి సురేష్ కనిపించిన విధానం వర్ణనాతీతం అని చెప్పాలి. ఒక్క నిమిషం సావిత్రి గారు మళ్లీ పుట్టినట్లు ఉందని అనిపిస్తుంది. కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ కోసమే పుట్టింది అన్నట్లు నెటిజన్స్ కామెంట్స్ కూడా అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సమంత ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.