`స‌వ్య‌సాచి`కి స్వాతంత్య్రం?

Sunday, June 10th, 2018, 11:47:14 AM IST

అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ప్రేమ‌మ్ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న `స‌వ్య‌సాచి` ఎప్పుడు రిలీజ‌వుతుంది? ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాప‌డిన ఈ చిత్రం రిలీజ్‌పై పూర్తి సందిగ్ధ‌త నెలకొంది. అయితే అందుకు స‌హేతుక కార‌ణం లేక‌పోలేదు. చైతూ ఈ సినిమాతో ఎట్టిప‌రిస్థితిలో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాల‌ని శ‌త‌ధా తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో పూర్తిగా ప్ర‌యోగం చేస్తున్నాడు.

ఈ ప్ర‌యోగంలో గ్రాఫిక్స్ అద‌న‌పు భాగం అయ్యాయిట‌. దాంతో కాన్వాసు అంత‌కంత‌కు పెరుగుతోంది. ఈ గ్రాఫిక్స్ వ‌ర్క్ వ‌ల్ల సినిమా రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంది. ఇప్ప‌టికే జూన్ రిలీజ్ కాస్తా జూలైకి వాయిదా ప‌డింది. అటుపై ఇప్పుడు జూలై నుంచి ఆగ‌ష్టుకి వాయిదా వేశార‌ని తెలుస్తోంది. చైతూ స్వాతంత్య్ర‌దినోత్స‌వ కానుక అందించ‌నున్నాడు. స‌వ్య‌సాచి ఆగ‌ష్టు 10న రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. దీనిని బ‌ట్టి జూలై 27 రిలీజ్ క‌ష్ట‌మేన‌ని ఖాయ‌మైంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments