హిట్టా లేక ఫట్టా : స‌వ్య‌సాచి – ఫ‌స్టాఫ్ అలా.. సెకండాఫ్ ఇలా..!

Friday, November 2nd, 2018, 02:25:46 PM IST

అక్కినేని సినీ వార‌సుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య‌, ల‌వ‌ర్ బాయ్‌గా మంచి హిట్స్ కొట్టాడు. అయితే గ‌త కొంత కాలంగా యాక్ష‌న్ హీరోగా గుర్తింపు పొందేకు ప్ర‌య‌త్నాలు చేసిన చైతూ చేతులు కాల్చుకున్నాడు. దీంతో ఎలాగైనా సాలిడ్ కొట్టాల‌ని భావిస్తున్న చైత‌న్య ఈసారి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన స‌వ్య‌సాచి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. వ‌రుస విజ‌యాలో దూసుకుపోతున్న‌ మైత్రీ మూవీస్ మేక‌ర్స్ నిర్మాణంలో తెర‌కెక్కిన స‌వ్య‌సాచి చిత్రాన్నిచందూ మొండేటి ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. మ‌రి దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 2న ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌వ్య‌సాచి చిత్రం హిట్టా లేక ఫ‌ట్టా అనేది తెలుసుకుందాం.

విక్రమ్ ఆదిత్య(నాగ చైతన్య) ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో స‌త‌మ‌తం అవుతూ ఉంటాడు.ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా గ‌డుపుతూ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ ఆదిత్య‌, చిత్ర(నిధి అగర్వాల్)ను ప్రేమిస్తాడు. ఒక‌వైపు ఫ్రెండ్స్‌తో స‌ర‌దాలు, మ‌రోవైపు చిత్ర‌తో ప్రేమ‌, సాఫీగా సాగుతున్న ఆదిత్య.. త‌న మేన‌కోడ‌లు కిడ్నాప్ అవ‌డంతో ఆదిత్య‌ లైఫ్‌లో ఊహించ‌ని మ‌లుపు వ‌స్తుంది. ఈ నేప‌ధ్యంలో త‌న మేన‌కోడ‌లును ఎవరు కిడ్నాప్ చేశారు.. ఎందుకు చేశారు.. ఆ మిస్ట‌రీని చేధించే క్ర‌మంలో ఆదిత్య ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే స‌వ్య‌సాచి చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిదే.

స‌వ్య‌సాచి స్టార్ట్ అయిన 15 నిమిషాల్లో దర్శకుడు చందూ మొండేటి అస‌లు కథలో తీసుకెళతాడు. అయితే ఆ త‌ర్వాత హీరోయిన్‌తో వ‌చ్చే ల‌వ్ ట్రాక్, ఫ్రెండ్స్‌తో జరిగే సీన్స్‌ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా డిజైన్ చేయ‌క‌పోవ‌డంతో కొచెం బోర్ ఫీల్ వ‌స్తోంది. దీంతో ఫ‌స్టాఫ్ ప‌ర్వాల్యేద‌నిపిస్తూ.. ఊహించ‌ని మ‌లుపుతో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండాఫ్ పై ఆశ‌క్తి పెంచుతాడు ద‌ర్శ‌కుడు. అయితే మాధ‌వ‌న్ ఎంట్రీతో థ్రిల్లింగ్‌గా సాగాల్సిన సెకండాఫ్ ప్రేక్ష‌కుడిలో క్యూరియాసిటిని పెంచ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు డైరెక్ట‌ర్. మాధ‌వ‌న్- చైత‌న్య‌ల మ‌ధ్య మైండ్‌గేమ్‌ని ఆశ‌క్తిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డంతో సెకండాఫ్ కూడా య‌వ‌రేజ్‌గా అనిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే ల‌వ్ ఎపిసోడ్స్‌లో త‌న‌దైన ఈజ్‌తో న‌టించాడు. చైతూ గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. యాక్ష‌న్ ఎపిపోడ్స్‌లో ప‌ర్వాలేద‌నిపించాడు. కాలేజ్‌లో జరిగే ఫైట్ అదిరిపోగా.. సుభద్ర పరిణయం కాన్సెప్ట్ హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో మెయిన్ ప్ల‌స్ మాధ‌వ‌న్.. నెగిటీవ్ క్యారెక్ట‌ర్‌లో మాధ‌వ‌న్ న‌టన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పాలి. చైతూత‌దో మైండ్‌గేమ్ సీన్ల‌లో మాధ‌వ‌న్ చెల‌రేగిపోయ‌రనే చెప్పాలి. ఇక తెలుగు వెండితెర పై తొలిసారి ఎంట్రీ ఇచ్చిన నిధి అగ్రవాల్ ప‌ర్వాలేద‌ని పిస్తుంది. ఇక రావుర‌మేష్‌, వెన్నెల కిషోర్, భూమిక‌లు త‌మ ప‌రిదిమేర‌కు న‌టించారు.

ఇక ఈ చిత్రంలో కీర‌వాణి సంగీతం యావ‌రేజ్‌గా ఉన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆక‌ట్టుకుంటుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్ ప‌ర్వాలేదు. కొన్ని సీన్స్ లాగ్ అయిన‌ట్టు అనిపిస్తాయి.. వాటిని ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. ద‌ర్శ‌కుడు రాసుకు క‌థ బాగున్న‌ప్ప‌ట‌కీ, దాన్ని స్కీన్ మీద ప్రెజెంట్ చేయ‌డంలో చందూ మొండేటి త‌డ‌బ‌డ్డాడనే చెప్పాలి. కామెడీ, ల‌వ్ ట్రాక్‌లు ప‌ర్వాలేద‌ని పించినా.. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ సీన్స్ స‌రిగ్గా డిజైన్ చేసుకోక‌పోవ‌డంతో స‌వ్య‌సాచి యావ‌రేజ్ చిత్రంగా నిలుస్తుందని.. ఫైన‌ల్‌గా చెప్పాలంటే ప‌స్టాఫ్ కొంచెం ఎంట‌ర్‌టైనింగ్‌గా.. సెకండాఫ్ కొంచెం థ్రిల్లింగా స‌వ్య‌సాచి ఉంద‌ని ప్రేక్ష‌కులు తేల్చేశారు.

పర్వాలేదనిపించే రివేంజ్ డ్రామా..

Reviewed By 123telugu.com |Rating : 3/5

ఆక‌ట్టుకునే థ్రిల్లింగ్ డ్రామా..

Reviewed By Thehansindia.com|Rating : 3/5