సూర్యకు అఖిల్ హీరోయిన్ నచ్చిందట ?

Thursday, May 17th, 2018, 03:06:25 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న ఎన్ జి కె సినిమా షూటింగ్ పూర్తయింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత అయన కె వి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకోసం పలువురు భామల పేర్లు పరిశీలించిన మీదట సయేశా సైగల్ ని ఎంపిక చేశారట. ఈ మధ్య కాలంలో సయేశాకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సయేశాకు ఈ క్రేజీ ఛాన్స్ దక్కడంతో ఆమె త్వరలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరినట్టే. సూర్య సినిమాలో మోహన్ లాల్, అల్లు శిరీష్, ఆర్య లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

Comments