నిధులు లేక విలవిలలాడుతున్న జగన్..ఇదేమి కర్మరా దేవుడా..?

Tuesday, October 8th, 2019, 03:53:19 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రస్తుతం పీకల్లోతు అప్పులో ఉంది. లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయటానికి ఎవరు ముందుకి రావటంతో లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్స్ నిధులను రాష్ట్ర అవసరాలకు ఉపయోగిస్తుంది, అయితే ఇప్పుడు కార్పొరేషన్స్ కి కూడా నిధులు కొరత వచ్చింది. కనీసం వాటికీ బ్యాంక్ లోన్స్ ఇవ్వటానికి కూడా బ్యాంకర్లు ముందుకి రావటం లేదు.

రాష్ట్రంలో విద్యుత్ సంస్థ తమకి మూడు వేల కోట్లు లోన్ కావాలని SBI ని కోరింది. అయితే SBI బ్యాంకు లోన్ ఇవ్వటానికి నిరాకరించింది. విద్యుత్ సంస్థ యొక్క లాభనష్టాలు బేరీజు వేసుకుంటే ఒక్క పదిరూపాయలు కూడా లోన్ వచ్చే అవకాశం లేదు. దీనితో ప్రభుత్వం హామీ ఇస్తానని చెప్పింది, నిజానికి ప్రభుత్వం హామీ ఇస్తుంటే కళ్ళు మూసుకొని లోన్స్ ఇస్తారు బ్యాంకర్లు, అయితే SBI బ్యాంకు మాత్రం లోన్ ఇవ్వటానికి ముందుకి రాలేదు.

దానికి కారణం కూడా లేకపోలేదు, అసలే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పులో ఉంది, సంక్షేమ పథకాలంటూ ఉన్న డబ్బులను అటు మళ్లిస్తున్నారు, దానికి తోడు గత ప్రభుత్వం చేస్తానన్న హామీలను ఇప్పటి జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది, ఇదే రీతిన జగన్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు కూడా వచ్చే ప్రభుత్వం పాత బకాయిలు అంటూ పేచీలు పెడితే పరిస్థితి ఏమిటనే భయం వాళ్లలో ఉంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ జీడీపీ మరింత తగ్గిపోతుంది. దీనితో రుణాలు పొందే అర్హత రాష్ట్రము కోల్పోతుంది, అందుకే బ్యాంకర్లు లోన్లు ఇవ్వటానికి భయపడుతున్నారు.