బాహుబలి హాట్ బ్యూటీతో షకలక శంకర్ స్టెప్పులు!

Monday, July 30th, 2018, 05:35:36 PM IST

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ కమెడియన్ గా చాలా తక్కువ కాలంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల హీరోగా శంభో శివ శంకర అంటూ ఆడియెన్స్ ని అలరించేందుకు ప్రయత్నం చేశాడు. ఆ సినిమా మాస్ ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇంతకుముందే శంకర్ ఒకే చేసిన డ్రైవర్ రాముడు సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేణుగోపాల్ – రాజు – కీరత్ నిర్మిస్తున్నారు.

ఇక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరిస్తున్నారు. బాహుబలి కెమెరామెన్ గంగతో రాంబాబు ఎవడు వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించిన హాట్ బ్యూటీ స్కార్లెట్ విల్సన్ ఈ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందట. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ సాంగ్ చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని శంకర్ వివరణ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments