ఆ స్కూల్ కి ఆ కంపెనీ షూలోనే వెళ్ళాలి..అయ్యప్ప మాలతో వెళ్లినా నో ఎంట్రీ..!

Wednesday, November 30th, 2016, 06:03:35 PM IST

school
రానురాను ప్రవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉప్పల్ లోని గ్లోబల్ ఇండియన్ స్కూల్ లోని నిభందనలు నియంత ప్రభత్వాన్ని తలపిస్తాయి. తాము సూచించిన కంపెనీ షూ కాకుండా వేరే షూ వేసుకొచ్చాడనే నెపంతో ఓ విద్యార్థిని స్కూల్ లోకి అనుమతించలేదు. మరో వైపు మేడ్చల్ పరిధిలోని ఈసీ ఐ ఎల్ కాప్రా కాల్ పబ్లిక్ స్కూల్ లో ఓ విద్యార్థి అయ్యప్ప మాలలో వచ్చారని లోనికి అనుమతించలేదు.

ఆ చిన్నారిని యాజమాన్యం ఇంటికి పంపేసింది. దీనితో చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఇది పాకిస్థానా లేక హిందుస్థానా అంటూ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులు పలువురు అయ్యప్ప స్వాములతో కలసి స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. దేనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ లు జోక్యం చేసుకుని స్కూల్ యాజమాన్యంతో చర్చిస్తున్నారు.