జూలైలో తెరుచుకోనున్న స్కూల్స్.. ఆ తరగతులకు మాత్రమే..!

Tuesday, May 26th, 2020, 02:41:46 AM IST

కరోనా వైరస్ కారణంగా దేశమంత లాక్‌డౌన్ పాటిస్తుండడంతో ఆ ప్రభావం విద్యార్థులపై కూడా పడింది. అయితే అనేక రాష్ట్రాలలోని విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేస్తూ విద్యా సంవత్సరాన్ని ముగించేసాయి.

అయితే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం దేశవ్యాప్తంగా స్కూళ్ళను తెరిచేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది. జూలై నుంచి స్కూళ్లను దశలవారీగా రీఓపెన్‌ చేయాలని కేంద్రం భావిస్తుంది. అయితే 8వ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు ప్రారంభించాలని ఆ తరువాత పరిస్థితులను బట్టి చిన్న తరగుతుల విద్యార్ధులను అనుమతించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.