వైరల్ న్యూస్ : 40 వేల ఏళ్ల క్రితం తోడేలు తల దొరికింది.!

Wednesday, June 12th, 2019, 11:07:26 PM IST

మాములుగా ఒక తోడేలు మహా అంటే ఎంత ఎత్తు ఉంటుంది? ఒక 60 నుంచి 80 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది.కానీ 40 వేల ఏళ్ల క్రితం ఉండే ఒక తోడేలు యొక్క తలను సైబీరియా కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.కనుగోడంతోనే దాన్ని చూసి షాక్ కు గురయ్యారు.ఎందుకంటే ఈ తోడేలు యొక్క తల ఇప్పటి తోడేళ్ళు కన్నా చాలా పెద్దగా ఉందట.ముఖ్యంగా ఇప్పటివి కేవలం 9 అంగుళాలు మాత్రమే ఉంటే అది మాత్రం ఏకంగా 16 అంగుళాలతో ఉండి భయంకరంగా ఉందని తెలుస్తుంది.

ఇక్కడే మరో నివ్వెర పోయే అంశం ఏమిటంటే టోక్యోకు చెందిన మరో శాస్త్రవేత్త వారి అంచనాల ప్రకారం ఇది 40 వేల ఏళ్ల నాటి కిందదని అయినా సరే ఇప్పటికి కూడా దీని తలలో ఉండే కండరాలు కానీ మెదడులో ఉన్న కణజాలాలు కానీ పాడవ్వలేదని తెలిపారు.అంతే కాకుండా మరో రష్యన్ శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ప్రొటో ప్రోపోవ్ ఇలాంటి జీవి తలను అందులోను పూర్తిస్థాయి కణజాలంతో కనుగొనడం ఇదే ప్రపంచంలో మొట్టమొదటి సారని తెలిపారు.అలాగే వీటి ద్వారా ఇప్పుడున్న తోడేళ్ళ శక్తితో దీన్ని అంచనా వేసి చెప్తామని క్లారిటీ కూడా ఇచ్చారు.