ఆ మల్టీస్టారర్ కోసం స్క్రిప్ట్ ఇంకా చెక్కలేదట ?

Friday, June 15th, 2018, 01:04:10 PM IST

బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కే సినిమాకు క్లారిటీ రావడం .. అదికూడా ఇద్దరి క్రేజీ హీరోలతో మల్టి స్టారర్ సినిమా ప్రకటించడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై అటు ప్రేక్షకులు… ఇటు సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ,మరో వైపు ఈ సినిమా పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా ఉంటాడని. సినిమాకు ఇద్దరు ఇద్దరే అనే టైటిల్ పెడతారని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా మన జక్కన్న అదేనండి రాజమౌళి ఈ సినిమా గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు లైన్ మాత్రమే అనుకున్నామని… ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదని, విజయేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలోనే ఉన్నాడని చెప్పాడు. సో దీన్ని బట్టి చుస్తే ఇంకా కథ కూడా ఫైనల్ కానీ ఈ సినిమా బహుశా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.