రేణుదేశాయ్ కి రెండో పెళ్లి – ఫోటోషూట్ కూడా జరిగిందిగా…

Friday, June 14th, 2019, 03:24:40 AM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మళ్ళీ పెళ్లికి రెడీ కాబోతుంది. అయితే అందుకు సంబందించిన ఫోటో షూట్ కూడా జరిగిపోయిందట. రేణుదేశాయ్ అంటే ఒకప్పటి మోడల్, నటి, దర్శకురాలు. ఇవన్నీ కూడా పక్కనపెట్టి మరి పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే అందరి నోర్లలో గుర్తుండిపోతుంది. ఆమెకు అంతటి క్రేజ్ వచ్చింది కూడ కేవలం పవన్ కళ్యాణ్ వలనే. పవన్ తో విడిపోయాక కూడా రేణుదేశాయ్ పవన్ కి మాజీ భార్య గానే మిగిలిపోయింది. పవన్ పిల్లలకి తల్లిగా ఉంటానని చెప్పిన రేణుదేశాయ్, పవన్ కి మాజీ భార్యగా ఉండదం ఇష్టం లేదని చాలా సార్లు చెప్పింది. ప్రస్తుత విషయానికి వస్తే రేణుదేశాయ్ రెండో పెళ్ళికి సిద్దమయింది. ఈ వార్తలు ఎప్పటినుంచో వినబడుతున్నా ఆ వార్తలకి ఇప్పటికి తెరపడింది అని చెప్పాలి. తన రెండో పెళ్ళికి సర్వం సిద్దమయింది. అందుకు జరగాల్సిన పనులు కూడా పూరయినట్లు సమాచారం.

రేణుదేశాయ్ కి నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అయితే రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకునేది ఎవరిని అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే కొన్ని రోజులనుండి ఈ వార్తలు సైలెంట్ అయిన నేపథ్యంలో రేణు పెళ్లి ఆగిపోయిందని అందరు అనుకున్నారు. కానీ మళ్ళీ ఆవార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తన పెళ్ళికి సంబందించిన పోటోలను కొన్నింటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి, అవి త‌న‌కు కాబోయే వాడు క్లిక్ చేసిన ఫోటోస్ అని చెబుతూ, త‌న ఫియాన్సీకి థ్యాంక్స్ కూడా చెప్పింది రేణుదేశాయ్. దీనిని బట్టి చూస్తుంటే త్వరలోనే తన పెళ్లి జరగనుందని చెప్పకనే చెప్పింది రేణుదేశాయ్.