`దంగ‌ల్‌` రికార్డులు కొట్టేస్తున్న ఏకైక సినిమా ?

Monday, January 22nd, 2018, 04:22:10 PM IST

బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ స‌బ్జెక్ట్ ఎంచుకుంటే అది ఎంత ప్ర‌భావ‌వంతంగా ఉంటుందో, ఎంత యూనివ‌ర్శ‌ల్‌గా ఉంటుందో చెప్ప‌డానికి ఇదో తాజా ఉదాహ‌ర‌ణ‌. ఇదివ‌ర‌కూ అత‌డు న‌టించిన `దంగ‌ల్‌` వ‌ల‌ర్డ్ వైడ్ రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ముఖ్యంగా చైనాలో ఏకంగా 1200 కోట్లు వ‌సూలు చేసింది. ఆ వ‌సూళ్లు ఇండియ‌న్ బాక్సాఫీస్‌తో పోలిస్తే రెట్టింపు వ‌సూళ్లు. అయితే `దంగ‌ల్‌`ని కొట్టే వేరొక సినిమా వ‌స్తుందా? అని ఎదురు చూసిన వారికి అంత‌కుమించిన వేరొక సినిమా వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది.

మొన్న‌టికి మొన్న అమీర్ ఖాన్ న‌టించిన `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` చైనాలో రిలీజైంది. ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌కోట్లు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. వాస్త‌వానికి అదే తొలి రెండు రోజుల్లో చైనా బాక్సాఫీస్ వ‌ద్ద `దంగ‌ల్‌` కేవ‌లం 45 కోట్లు వ‌సూలు చేసింది. ఆ వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇంచుమించు రెట్టింపు వ‌సూళ్లు తెచ్చింది `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌`. అంతేకాదు తొలివారం ఎండింగుకి దంగ‌ల్ తొలి వీకెండ్ రికార్డుల్ని కొట్టేస్తూ ఈ సినిమా ఏకంగా 200కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. `సీక్రెట్ సూప‌ర్‌స్టార్` డే-1 లో సాధించిన వ‌సూళ్లు -44 కోట్లు (6.79 మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు), డే-2లో 67 కోట్లు (11 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. దంగ‌ల్ డే-1లో 15 కోట్లు (2.27 మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు), డే-2లో 31 కోట్లు (4.69 మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు) వ‌సూలు చేసింది. తొలివారంలో దంగ‌ల్ 187 కోట్లు వ‌సూలు చేస్తే `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` ఏకంగా 200 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక ఫుల్ ర‌న్‌లో దంగ‌ల్ సాధించిన 1200 కోట్ల రికార్డును కొట్టేస్తుందో ఏమో? అని ముచ్చ‌ట సాగుతోంది. అయితే ఎలాంటి హైప్ లేకుండా రిలీజైన దంగ‌ల్‌తో పోలిస్తే భారీ హైప్‌తో సీక్రెట్ సూప‌ర్‌స్టార్ రిలీజైంది కాబట్టి ఆరంభ వ‌సూళ్ల స్పీడ్ ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు. ఫుల్ ర‌న్‌లో ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో చూడాలి.