`దంగ‌ల్‌` రికార్డ్స్ బ్రేక్‌! సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌@240 కోట్లు

Wednesday, January 24th, 2018, 02:34:30 PM IST

చైనాలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది దంగ‌ల్‌. ఇప్పుడు ఆ రికార్డుల్ని తిర‌గ‌రాసే వేరొక సినిమా వ‌చ్చింది. అదే సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌. ఈ సినిమా చైనా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది. రిలీజైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి, అటుపై కేవ‌లం నాలుగు రోజుల్లో 200 కోట్ల క్ల‌బ్లో అడుగుపెట్టింది. ఐదు రోజుల‌కు ఏకంగా 240 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ స్పీడ్ చూస్తుంటే .. ఈ సినిమా మ‌రో రెండు వారాల్లోనే `దంగ‌ల్‌` రికార్డుల‌న్నీ కొట్టేస్తుందా? అనిపిస్తోంది. ఫుల్ ర‌న్‌లో దంగ‌ల్ 1000 కోట్లు వ‌సూలు చేసింది. ఆ రికార్డుల్ని సీక్రెట్ సూప‌ర్‌స్టార్ బ్రేక్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఇదే హుషారులో అమీర్‌ఖాన్‌, జైరా వాసిమ్ అండ్ టీమ్ చైనాలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో చుట్టేస్తూ ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు.

తాజాగా `షాంగై`లో అమీర్ బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్‌లో అందించిన వివ‌రాలు ప‌రిశీలిస్తే… . శుక్ర‌, శ‌ని, ఆది, సోమ‌, మంగ‌ళ.. ఐదు రోజులు క‌లుప‌కుని.. 37 మిలియ‌న్ అమెరిక‌న్‌ డాల‌ర్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు 237 కోట్లు ఇది. . అన్‌స్టాప‌బుల్‌ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంద‌ని త‌ర‌ణ్ ప్ర‌శంసించారు. దంగ‌ల్ ఐదు రోజుల వ‌సూళ్ల రికార్డు బ్రేకైంది. ఇక ఫుల్ ర‌న్ రికార్డులు బ్రేక్ చేయ‌డ‌మే బ్యాలెన్స్‌!