సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌.. మ‌రో 10 రోజుల్లో 1000 కోట్లు?

Monday, January 29th, 2018, 10:51:23 PM IST

మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ త‌డాఖా ఏంటో మ‌రోసారి తెలిసొచ్చింది. అత‌డు న‌టించిన `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దంగ‌ల్ త‌ర్వాత చైనాలో దుమ్ము దులిపేస్తున్న హిందీ సినిమాగా జేజేలు అందుకుంటోంది ఈ చిత్రం. ఈ సినిమా రిలీజైన కేవ‌లం 10 రోజుల్లోనే 500 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. ఇక 1000 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డ‌మే ల‌క్ష్యంగా దూసుకెళుతోంది. ప్ర‌స్తుత దూకుడు చూస్తుంటే మ‌రో 10-15 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమాతో అమీర్ త‌న కెరీర్‌లో ఐదు 500 కోట్ల క్ల‌బ్ సినిమాల్ని వెన‌కేసుకున్నాడు. ఇది అసాధార‌ణ విష‌యం. సీక్రెట్ సూప‌ర్‌స్టార్ టాప్ గ్రాస‌ర్స్‌లో టాప్‌ -10 సినిమాల జాబితాలో నిలిచింది.

ఇప్ప‌టికి `దంగ‌ల్‌` 1200 కోట్ల వ‌సూళ్ల‌తో వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల‌లో నంబ‌ర్ -1 పొజిష‌న్‌లో ఉంది. ఆ త‌ర్వాత‌ `బాహుబ‌లి-2` నంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉంది. ఇక సీక్రెట్ సూప‌ర్‌స్టార్ 9వ స్థానంలో నిలిచింది. అక్క‌డి నుంచి ఆ పైన ఉన్న ఖాన్‌ల సినిమాల్ని దాటుకుని గ్రాఫ్ ప‌రంగా పైకి రావాల్సి ఉంటుంది. ఒక‌వేళ చైనాలో 1000 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే ఈ సినిమా టాప్ 2, 3 స్థానాల‌కు చేరే అవ‌కాశం ఉంటుంది.