ప్రత్యేక ఇంక్రిమెంట్ పై రభస

Monday, September 15th, 2014, 05:04:27 PM IST


హైదరాబాద్ లో సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక ఇచ్చిన ప్రత్యేక ఇంక్రిమెంట్ ను నిరసిస్తూ ఉద్యోగులు సోమవారం లంచ్ అవర్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ తో తమకు లాభం లేదని ధ్వజమెత్తారు. అలాగే స్పెషల్ పే ను అన్ని అలవెన్సులు వర్తించే రెగ్యులర్ ఇంక్రిమెంట్ గా మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణ ప్రభుత్వానికి మార్చాలని ఉద్యోగులు విజ్ఞ్యప్తి చేశారు. అలాగే పీఆర్సీ, హెల్త్ కార్డులు వెంటనే అమలు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.