ట్రైల‌ర్: దేశీ సూప‌ర్‌హీరో త‌డాఖా

Thursday, May 3rd, 2018, 09:18:20 PM IST

సూప‌ర్‌మేన్ .. బ్యాట్‌మేన్‌.. యాంట్‌మేన్‌.. ఎక్స్ మెన్ .. ఇలా చాలామంది సూప‌ర్‌హీరోలు ఉన్నారు. వీళ్లంద‌రికీ అసాధార‌ణ‌మైన సూప‌ర్‌ప‌వ‌ర్స్ ఉన్నాయి. తాంత్రిక శ‌క్తులు ఉన్నాయి. కానీ అలాంటి శ‌క్తులేవీ లేని దేశీ సూప‌ర్‌మేన్‌ని ఎప్పుడైనా చూశారా? అయితే మీకో అరుదైన అవ‌కాశం. ఏ శ‌క్తి లేకుండా గొప్ప శ‌క్తిగా ముంబై న‌గ‌రాన్ని కాపాడే గ్రేట్ ప‌ర్స‌నాలిటీ సినిమా చూడ‌బోతున్నాం. అలా న‌టించింది ఎవ‌రో తెలుసా? అత‌డో స్టార్ హీరో కొడుకు. ది గ్రేట్ క‌పూర్ ఫ్యామిలీ వార‌సుడు.. చెక్ దిస్ డీటెయిల్స్‌…

ఆ స్టార్ స‌న్ ఎవ‌రు? అని క‌న్ఫ్యూజ‌న్ వ‌ద్దేవ‌ద్దు. అత‌డు బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ క‌పూర్ త‌న‌యుడు, ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్ సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్. ఇప్పుడే కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నేం లేదు. ఈ యంగ్ బోయ్ తెరంగేట్రంపై క‌పూర్ ఫ్యామిలీ ఎంతో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా శ్ర‌మిస్తోంది. ఇదివ‌ర‌కూ `మిర్జియా` అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ వెంట‌నే అత‌డు ఎంచుకున్న కాన్సెప్టు మాత్రం సంథింగ్ సంథింగ్ అనే చెప్పాలి. ద్వితీయ ప్ర‌య‌త్న ంతో అత‌డు పెద్ద రేంజులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ `సూప‌ర్‌హీరో`. భ‌వ్యేష్ జోషి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. హాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హిట్ `కిక్ యాస్‌` స్ఫూర్తితో రియ‌లిస్టిక్ ఎప్రోచ్‌లో రియ‌లిస్టిక్ క్యారెక్ట‌ర్ల‌తో తీర్చిదిద్దిన చిత్ర‌మిది. ట్రైల‌ర్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పెర్ఫామెన్స్ క‌నిపిస్తోంది. ముంబైలో హ‌ద్దుమీరిన అరాచ‌కాల్ని ఆపేందుకు దేశీ సూప‌ర్‌మేన్ ఏం చేశాడ‌న్న క‌థాంశంలోనే సంథింగ్ కిక్కు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైతే ట్రైల‌ర్‌తో స‌రిపుచ్చుకుందాం. తొంద‌ర్లోనే సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. అంత వ‌ర‌కూ జ‌స్ట్ వెయిట్…

  •  
  •  
  •  
  •  

Comments