ఆ హీరోయిన్ అభిమాని రకుల్ ని కలవరపెట్టాడు..!

Thursday, December 29th, 2016, 12:33:08 PM IST

rakul-preeth
నటీ నటులపై అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. ‘రన్ రాజా రన్ ‘ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ గుర్తుందిగా..ఆమె అభిమాని రకుల్ ప్రీత్ ని కలవరపెట్టాడు.సీరత్ కపూర్ కి అభిమాని అయిన అతడు చేతిపై ‘ఎస్’ ఆకారంలో గాటు పెట్టుకున్నాడు. ఆ ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసాడు. దీనిని చూసిన తరువాత తనకు మాటలు రాలేదని సీరత్ ఆవేదన వ్యక్తం చేసింది. జీవితం చాలా విలువైనదని, మీరు కూడా చాలా విలువైనవారని.. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి అని ట్విట్టర్ లో బదులిచ్చింది. ఎవరికోసమే మీకు మీరు హాని తలపెట్టుకోవద్దని సూచించింది. దీనిని రకుల్ ప్రీత్ సింగ్ రీట్వీట్ చేసింది. ఇది చాలా కలవర పెట్టే అంశమని పేర్కొంది.అయినా అభిమానులు ఇలా పిచ్చి చేష్టలు చేయడం మాములే అని సోషల్ మీడియా లో కొందరు ఈ ఘటనపై కామెంట్లు పెడుతున్నారు. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇది ఎడిటింగ్ మాయాజాలం అని తీసిపారేసిన వారూ లేకపోలేదు.

  •  
  •  
  •  
  •  

Comments