సీరత్ కపూర్ మరో షాకింగ్ పిక్

Monday, October 30th, 2017, 04:17:20 PM IST

రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంటోంది. వచ్చిన కొత్తలో చాలా సింపుల్ గా ఉండే ఈ భామ ఛాన్సులు రాకపోవడంతో కొంచెం హాట్ ఫొటో షూట్స్ కి స్టిల్స్ బాగానే ఇచ్చింది. ఎవరు ఊహించని విధంగా టాప్ లెస్ అందాలంటూ.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తానికి ఫొటో షూట్స్ అమ్మడికి ఛాన్సులను తెచ్చి పెట్టాయి. రాజు గారి గది 2 సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించిన సీరత్ గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే రీసెంట్ గా మరొక ఫొటోని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న బికినీ ఫొటో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన సీరత్ అందాలపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. సీరత్ చాలా అందంగా ఉందని అంటున్నారు. ప్రస్తుత సీరత్ రవి తేజ – టచ్ చేసి చూడు అలాగే మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments