సూర్యకుమార్ యాదవ్ ఔట్ పై సెహ్వాగ్ ట్వీట్..!

Friday, March 19th, 2021, 12:12:19 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గవ టీ 20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఔట్ కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సూర్య కుమార్ ఔట్ కాకపోయినప్పటికీ థర్డ్ ఎంపైర్ ఔట్ ఇవ్వడం ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. క్యాచ్ అందుకున్న డేవిడ్ మలాన్ పై మాత్రం మెమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా సూర్య కుమార్ యాదవ్ ఔట్ పై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఒక ఫోటో లో కళ్ళకు గంతలు కట్టుకుని ఒక కుర్రాడు ఉండగా, ఇంకో ఫోటో లో నేలకు తాకి క్యాచ్ పట్టుకున్న మలాన్ మరో పక్కన పెట్టి ట్వీట్ చేశాడు. అయితే థర్డ్ ఎంపైర్ కళ్లు మూసుకొని ఎంపైర్ చేశాడు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే నాల్గవ టీ 20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.