శేఖ‌ర్ క‌మ్ముల పేరుతో ఘ‌రానామోసం

Wednesday, June 27th, 2018, 10:21:39 PM IST

టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల పేరుతో సాగించిన ఓ ఘ‌రానా మోసం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌మ్ముల అసిస్టెంట్‌ని అంటూ ఓ ఘ‌రానా మోస‌గాడు ప‌లువురిని ఘోరంగా చీట్ చేశాడు. శేఖ‌ర్ క‌మ్ముల సైబ‌ర్ పోలీస్‌కి ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు సంగ‌తి బ‌య‌టికొచ్చింది.

హ్యాపీడేస్‌, ఫిదా చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల వ‌ద్ద‌ అసిస్టెంట్‌గా ప‌ని చేశాను. క‌మ్ముల ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు రూ.1500- 1800 మేర సొమ్ముల్ని ఖాతాలో జ‌మ చేయాల్సిందిగా ఓ బ్యాంక్ ఖాతాను ఇచ్చాడుట‌. ఈ ప్ర‌క‌ట‌న ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌లో 25రోజుల పాటు లైవ్ అయ్యింది. దీంతో అది నిజ‌మ‌ని న‌మ్మి చాలామంది డిపాజిట్లు క‌ట్టార‌ట‌. అయితే డ‌బ్బు చెల్లించాక స‌ద‌రు ఫేక్ అసిస్టెంట్‌కి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావ‌డంతో అనుమానం వ‌చ్చిన బాధితులు క‌మ్ముల‌నే నేరుగా సంప్ర‌దించార‌ట‌. అయితే తాను ఇంత‌వ‌ర‌కూ ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించ‌డం లేద‌ని క‌మ్ముల చెప్ప‌డంతో అంద‌రూ షాక్‌కి గుర‌య్యార‌ట‌. అయితే త‌న పేరుతో ఇంత‌టి ఘ‌రానా మోసానికి పాల్ప‌డిన స‌ద‌రు కేటుగాడి గురించి తెలుసుకుని క‌మ్ముల సైతం ఉలుకులిక్కి ప‌డ్డాడుట‌. మొత్తానికి క‌మ్ముల జీవితంలో ఓ గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్యలు తెలిసిన ఓ బ‌లాదూర్ కేటుగాడు త‌గిలాడ‌ని మాట్లాడుకుంటున్నారు. ఇక‌పోతే క‌మ్ముల ఇచ్చిన ఫిర్యాదుతో స‌ద‌రు ఫేక్ అసిస్టెంట్ సంగ‌తేంటో నిగ్గు తేల్చే ప‌నిలో ఉన్నారు సీసీఎస్ పోలీసులు.