బిగ్ వైరల్: సెల్ఫీ కోసం ఆగారు ఒకరి మీద ఒకరు పడ్డారు..!

Thursday, July 9th, 2020, 06:59:47 PM IST


సెల్ఫీ.. ప్రస్తుత కాలంలో సెలబ్రెటీలను మొదలుకుని, రాజకీయ నేతలను కలుపుకుని, సాధారణ జనం వరకు ఇదో ట్రెండ్‌లా మారిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకునే వరకు రకరకాల సెల్ఫీలు తీసుకుంటూ క్షణాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు.

అయితే ఈ సెల్ఫీల వల్ల పబ్లిసిటీ ఎంత ఉందో ప్రమాదం కూడా అంతే ఉంది. కొందరు అత్యంత ప్రమాదకర రీతీలో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ వ్యక్తి తన వెంట జనంతో ఓ చిన్న కాలువపై ఉన్న తాత్కళిక చెక్క వంతెనపై దాటుతూ వస్తున్నాడు. అదే సమయంలో ఓ యువకుడు సెల్ఫీ కోసం ఆ నాయకుడిని ఆపాడు. అయితే ఎక్కడ ఉన్నామో కూడా ఆలోచించకుండా అందరూ వంతెనపైనే నిలబడి ఫోటోకు ఫోజులిచ్చారు. ఇంకేముంది బరువు తూగలేక ఆ చెక్క వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో ఒకరి మీద ఒకరి నీటిలో పడిపోయారు. అయితే ఎత్తు తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అయితే వీరి వీడియో కాస్త ఫన్నీగా అనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/CCaaLhkpEsQ/?igshid=r3dzjvqt4l3p