శ్రీరెడ్డి పై సీనియర్ నటుడి ఫైర్

Monday, April 16th, 2018, 04:48:14 PM IST

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి అర్ధనగ్న మా అసోసియేషన్ నుండి బహిష్కరణ ఎదుర్కొంది. అయితే ఆ తరువాత పలువురు ప్రముఖుల తో తనను వేధించారని వారి పేర్లు, స్క్రీన్ షాట్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత మా సంఘం ఆమె బహిష్కరణకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ఉదంతంపై సీనియర్ నటులు, తెలుగుదేశం ఎంపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మురళీ మోహన్ స్పందించారు.

శ్రీరెడ్డి హిందూ ధర్మాన్ని మరిచి ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ‘మా’లో ప్రతి ఒక్కరికీ సభ్యత్వం ఇవ్వడం సాధ్యం కాదని ఆయనన్నారు. జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉండటంతో అందరూ ‘మా’ వైపు చూస్తున్నారని అన్నారు. అసలు శ్రీరెడ్డి ఎవరో, ఎన్ని చిత్రాల్లో నటించిందో కూడా తనకు తెలియదని, ఆమె ‘మా’లో సభ్యత్వానికి దరఖాస్తు చేసిందో లేదో కూడా తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ సభ్యత్వం నిరాకరించినా ఇలా నడి రోడ్డులో బట్టలు విప్పడం దారుణమని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా మీడియాను పిలవడం, మీడియా చానెల్స్ లో డిబేట్లు పెట్టడం తనకు మనస్తాపం కలిగించిందని ఆయనన్నారు.

ఇలా నిరసన తెలపడం వల్ల శ్రీరెడ్డికి ఏం ఒరిగిందని ఆయన ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించారని పలువురు టాలీవుడ్ ప్రముఖుల లీక్స్ బయటపెట్టిన ఆమెవల్లనే నిజానికి చాలామందికి నష్టం వాటిల్లిందని, శ్రీరెడ్డికి ఎదురైన కష్టాలు ఆమె వ్యక్తిగతమని అన్నారు. అవి బయటపెట్టడం వల్ల అవకాశాలు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. శ్రీరెడ్డి వివాదం పెద్దది కాదని, ఇది కేవలం పానకంలో పుడక లాంటిదని, దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments