చాల రోజులకి రీ-ఎంట్రీ ఇచ్చి ఏడ్పించేసింది గౌతమి..!

Thursday, March 8th, 2018, 05:06:07 PM IST

అన్ని ఏడాదిలకంటే ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా బిన్నంగా, కొంచం కొత్తగా జరుపికున్తున్నారు కొందరు సినీ నటులు. ఎందరో గొప్ప నటుల సరసన హీరోయిన్ గా చేసి చాలా కాలంగా సినీ పరిశ్రమకి దూరంగా ఉంటున్న నటి గౌతమి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేట్ వీడియో పాటను రూపొందించారు. అంటే కాకుండా ఈ వీడియోకు ‘గౌతమి’ అనే టైటిల్‌ను పెట్టడం విశేషం. ‘ఎవరూ రాయనిది ఈ కథనం..ఎప్పుడూ చూడనిది ఈ వైనం’ అంటూ సాగుతున్న ఈ పాటలో ఆడపిల్లలను వదిలించుకోవాలని చూడటం, దత్తత ఇచ్చేయడం వంటి నిజ జీవిత ఘటనలను చూపించారు. అనాథలైన ఆడపిల్లలను గౌతమి చేరదీసి పెంచుతారు. ఓ ఆడ శిశువును కుక్క నోటితో పట్టుకున్న సన్నివేశం ఈ పాటలో మనసుకి కన్నీరు కార్పించేలా చేసింది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాట మహిళలకు అంకితం చేయడానికి ఈ పాటను చేశాను అంటూ గౌతమి దీనిని ట్విటర్‌లో విడుదల చేశారు. కిదాంబరి పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ పాటను నిర్మించిన పాటలో గౌతమీ నటించడం విశ్లేషకరం.