షాక్ .. నటి ఖుష్బూకు రాజయోగం పట్టనుందా ?

Tuesday, October 17th, 2017, 02:00:06 PM IST

అప్పట్లో గ్లామర్ హీరోయిన్ .. ఆతరువాత నటిగా కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఖుష్బూ ప్రస్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. దాంతో పాటు అటు రాజకీయంగా కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఖుష్బూ కి బంపర్ అఫర్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? అవును తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆమెకు కట్టబెట్టే.. ఆలోచనలో సోనియా, రాహుల్ ఉన్నారట. {టి ఎన్సీపీ} అధ్యక్ష పదవిని ఆమెకు కట్టపెడితే సినిమా గ్లామర్ తో వచ్చే ఎన్నికల్లో సారథ్యం వహించి గెలిపించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో .. ఇలంగోవన్ , కె ఎన్ అళగిరి, మాణిక్ టాగోర్ లతో పాటు ఖుష్బూ కూడా ఉంది. తమిళనాడు లో మహిళా రాజకీయాలు ఎక్కువ కాబట్టి ఖుష్బూ కె ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ? సో మరో వారంలో అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేసారో తెలుస్తుంది.