సీనియ‌ర్ హీరో ఇల్లు గొడ‌వ తేలింది!

Friday, October 13th, 2017, 02:01:21 PM IST

ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడు! అన్నారు. ప్రాప‌ర్టీ సొంతం చేసుకోవ‌డం అంటే అంత వీజీ కాదు. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఇక పెళ్లి విష‌యంలోనూ ఇలాంటివెన్నో ఉంటాయి. అందుకే పై సామెత పుట్టింది. ఇంత‌కీ మ్యాట‌రేమంటే.. ఇలాంటి వివాదాలు సెల‌బ్రిటీల‌కు త‌ప్ప‌దు. పెద్దోళ్ల‌కు పెద్ద గొడ‌వ‌లు.. చిన్నోళ్ల‌కు చిన్న గొడ‌వలు.

ఆ త‌ర‌హాలో చూస్తే బాలీవుడ్ సీనియ‌ర్ హీరో దిలీప్ కుమార్ ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వంతి నిర్మాణ సంస్థ‌తో గ‌త కొంత‌కాలంగా గొడ‌వ ప‌డుతున్నాడు. త‌న‌కు క‌ట్టిస్తానన్న ఇల్లు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో దిలీప్ స‌ద‌రు సంస్థ‌తో కోర్టు కేసుల వ‌ర‌కూ వెళ్లాడు. అయితే ఫైన‌ల్‌గా ఈ కేసులో స‌ద‌రు సీనియ‌ర్ న‌టుడు నెగ్గుకొచ్చారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వంతి (పాళి హిల్ బంగ్లా) నిర్మాణం విష‌య‌మై ప్ర‌ముఖ బిల్డ‌ర్ ప్ర‌జిత డెవ‌ల‌ప‌ర్స్‌తో గొడ‌వ ప‌డిన దిలీప్‌-సైరాభాను జంట చివ‌రికి కోర్టులో స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకున్నారు. 2010లో మొద‌లైన వివాదం హైకోర్ట్‌, సుప్రీం స్థాయికి వెళ్లి అక్క‌డ ప‌రిష్కృత‌మైంది. అన్నిచోట్లా దిలీప్ – సైరాభాను జంట‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ప్ర‌జిత డెవ‌ల‌ప‌ర్స్ నుంచి ఆ ప్రాజెక్టును ప్ర‌ఖ్యాత‌ బ్లాక్‌రాక్ సంస్థ టేకోవ‌ర్ చేసింది. 20 కోట్ల మేర పాత కంపెనీకి చెల్లించి ప్రాజెక్టును చేజిక్కించుకుంది. అంతేకాదు దిలీప్ – సైరాభాను జంట‌ను సంతృప్తి ప‌రిచేలా భ‌వంతి నిర్మాణానికి బ్లాక్ రాక్ సంస్థ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. దిలీప్ ఫ్యామిలీకి ఓ ఫ్లాట్ నిర్మాణంతో పాటు, ఓ మ్యూజియంని ఆ భారీ భ‌వంతిలో అంకిత‌మిస్తోంది

  •  
  •  
  •  
  •  

Comments