సీఎం జగన్‌పై సీనియర్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, August 13th, 2019, 05:06:26 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ ఇంత ప్రజాభిమానాన్ని సంపాదించుకోవడానికి బాగానే కస్టపడ్డాడు. దాదాపు పదేళ్ళు ఓపిక పట్టాడు. అంతేకాదు 14 నెలలు, 3648 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టి జననాయకుడిగా ఈ సారి అధికారం అందిపుచ్చుకున్నాడు.

అయితే తాజాగా జగన్ పాదయాత్రపై ఎమెస్కో సంస్థ జయహో అనే పుస్తకాన్ని రూపొందించింది. జగన్ పాదయాత్రలో జరిగిన విషయాలు మరియు ఫోటోలను క్లుప్తంగా వివరించింది. అయితే ఈ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజాగా ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, జాతీయ జర్నలిస్ట్, ది ప్రింట్ పత్రిక ఎడిటర్ శేఖర్ గుప్తా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మాట్లాడిన శేఖర్ గుప్తా జగన్‌పై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని, వైఎస్ ఎలాగైతే ఆలోచించేవాడో జగన్ కూడా అదే మాదిరి ఆలోచిస్తున్నాడని అన్నారు. వైఎస్‌తో తనకు మంచి అనుబంధం ఉండేదని, ప్రస్తుతం జగన్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆలోచింపచేసేవిగా ఉన్నాయని అన్నారు.