జగన్ పాలనపై సీనియర్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!

Saturday, August 24th, 2019, 04:38:08 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ ఈ వంద రోజుల పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అనేక నిర్ణయాలు తీసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పులనే జగన్ చేస్తున్నాడని ప్రొఫెసర్ నాగేశ్వరరావ్ అన్నారు. టీడీపీ అధికారం కోల్పోవడంలో ముఖ్య కారణమైన ఇసుక విధానంలో కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని, ఇసుక విధానంలో కొత్త పాలసీనీ తీసుకొస్తానన్న జగన్ కాస్త ఆలస్యం చేస్తున్నారని ఇప్పటికే కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అంతేకాదు గ్రామ వాలంటీర్ల ఎంపిక విషయంలో కూడా నిరుద్యోగ యువత ప్రభుత్వంపై సానుకూలంగా లేదని గతంలో టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి కమిటీల మాదిరే ఈ ఎంపిక ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని అన్నారు. అంతేకాదూ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రీటెండరింగ్ విధానం, రాజధాని తరలింపు విషయాలపై కూడా ప్రజలలో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. రాజధాని మార్పుపై అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారని ఈ విషయంపై ఒక్కొ మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతుండడం సరికాదని ఏదేమైనా వీటిపైనా జగన్ త్వరలోనే సరైన నిర్నయాలు ప్రజలకు తెలియచేస్తే బాగుంటుందని లేకపోతే టీడీపీ హయాంలో బాబుపై ఏర్పడిన అసంతృప్తి వైసీపీపై కూడా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.