ఆ బాహుబలి సినిమాలో మాజి ముఖ్యమంత్రి

Saturday, September 30th, 2017, 11:39:10 AM IST

సాధారణంగా రాజకీయలకు సినిమాలకు కొంచెం దగ్గర సంబంధం ఉంటుందనే చెప్పాలి. చాలా మంది రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇక సీనియర్ నటి నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చూస్తారు. ఇక అప్పుడప్పుడు రాజకీయ నాయకులూ కూడా సినిమాల్లో కనిపించి షాక్ ఇస్తారు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నేతలు కొన్ని పాత్రలను చేసి అలరించారు.

అయితే ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఒక సినిమాలో స్పెషల్ రోల్ చేయనున్నారట. బాహుబలి సినిమాలో ప్రభాస్ కి డుబ్ గా చేసిన వ్యక్తి హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. అయితే అందులో రోశయ్య కేంద్ర మంత్రిగా కనిపించబోతున్నారట. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా కొన్ని నెలలు కొనసాగినా ఆయన ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ గాను కొన్నేళ్లు బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments