బాబోయ్ .. సాటిలైట్ డీల్ అంటే ఇదే బాసూ ?

Monday, May 7th, 2018, 11:27:09 AM IST

ఒక సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపించేది సాటిలైట్ హక్కుల విషయంలోనే. అది ఆయా స్టార్ హీరోల రేంజ్ బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రేట్ పలుకుతుంది. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సాటిలైట్ హక్కుల క్రేజ్ మరోలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకే అన్నాడు జరగని విధంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కుదిరిన డీల్ నిజంగా బాప్ కా బాప్ డీల్ అని చెప్పాలి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న రేస్ 3 సినిమా ఈ రంజాన్ కు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా ఈ సినిమా సాటిలైట్ హక్కుల విషయంలో బిగ్ డీల్ జరిగింది. ఆ డీల్ విలువ అక్షరాలా 400 కోట్లు ? ఏంటి సాటిలైట్ హక్కుల కోసం మరి ఇంత పెద్ద డీలా అని షాక్ అవుతున్నారా ? నిజమే అయితే ఈ డీల్ ఒక్క సినిమాకు కాదు . రేస్ 3 తో పాటు మరో నాలుగు సినిమాలకు కలిపి జీ టివి ఏకంగా 400 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ప్రస్తుతం సల్లు భాయ్ దే ప్రత్యక క్రేజీ అని చెప్పాలి. మొత్తానికి డీల్ అదిరింది కదా !!