హీరో విజయ్ తండ్రికి బెదిరింపులు .. కారణం ?

Friday, May 4th, 2018, 10:22:15 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖరన్ కు బెదిరింపులు వస్తున్నాయట? దానికి కారణం .. సమాజంలో జరిగే అన్యాయాలపై పోరాడుతున్న ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. అందులో రామస్వామి పాత్రలో చంద్రశేఖరన్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అయన బెదిరింపులు వస్తున్నాయని తెలిపాడు. తాను ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, రామస్వామి మాదిరిగానే తాను కూడా సమాజంలో జరిగే అన్యాయాలపై గట్టిగా పోరాటం చూస్తుంటానని అన్నాడు. తన మొదటి సినిమా ఓరు ఒరుత్తిరై సినిమా సమయంలోనే తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని అప్పుడే భయపడని నేను ఇప్పుడు ఎందుకు బయపడతానని అన్నారు. తన శిష్యుడు విక్కీ ఈ కథను చెప్పగానే బాగా నచ్చిందని అందుకే సినిమా చేస్తున్నానని అన్నారు.