వినాయక చవితి చేసినందుకు షారుఖ్ పై విమర్శలు ?

Monday, September 17th, 2018, 06:53:07 PM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ పై కొందరు ముస్లీములు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసలు నీవు ముస్లీమ్ వేనా అంటూ నానా కామెంట్స్ చేస్తున్నారు ? అదేంటి షారుఖ్ అంత పెద్ద తప్పు ఏమి చేసాడని వాళ్ళు ఆ రేంజ్ లో ఫైర్ అవుతున్నారని అనుకుంటున్నారా ? బాలీవుడ్ లో పలువురు స్టార్స్ వినాయక చవితిని ఇంట్లో గ్రాండ్ గా పూజ కార్యక్రమాలు జరుపుతున్న విషయం అందరికి తెలుసు. అమితాబ్, సల్మాన్ , అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది హీరోలు ఈ వేడుకలను గ్రాండ్ గా జరుపుతుంటారు .. ఈ కోవలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ కూడా తన ఇంట్లో వినాయక్ చవితి జరుపుకున్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దుమారం రేగింది. ఈ విషయంలో కొందరు ముస్లీములు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నువ్వసలు ముస్లీమువేనా, ముస్లీమ్ లో విగ్రహారాధనకు చోటు లేదంటూ ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని కుల, మాత ఛాందస వాదాలు .. ఓ రేంజ్ లో హజ్ క్రియేట్ చేస్తున్నాయి.