కుల వివక్షతా విధానంతో సంచలనం రేపిన యూఎస్ యూనివర్సిటీ.!

Wednesday, December 18th, 2019, 09:13:18 PM IST

ప్రస్తుత రోజుల్లో కుల వివక్షత అనేది నేటి సమాజంలో ఎంత వరకు పాతుకుపోయిందో అందరికి తెలుసు.ఇప్పుడు ఇదే “కులం” అంశం అనేది అగ్ర రాజ్యం అమెరికా దేశంలో పెను సంచలనంగా మారి హాట్ టాపిక్ గా నిలిచింది.ఇంతకీ అమెరికా అంతా ఒక్కసారిగా ఈ సరికొత్త కుల వివక్షతా పాలసీతో ఎందుకు ఒక్కసారిగా చర్చించుకుందో కాస్త చర్చిద్దాం.యూఎస్ లోని “బ్రాండీస్” అనే యూనివర్సిటీ తాలూకా అధ్యక్షుడు తమ యూనివర్సిటీలో వివక్షతా వ్యతిరేఖ విధానం(యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీ)లో కులాన్ని కూడా చేరుస్తున్నామని గత మంగళవారం ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే ఈ సరికొత్త విధానం అనేది భారతదేశానికి చెందిన వలసదారులపై మరింత ప్రభావం చూపించవచ్చని మరికొంత మంది నిపుణులు చెప్తుండగా..అయితే ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్ రోనాల్డ్ లైబోవిడ్జ్ మరియు చీఫ్ అధికారి మార్క్ బ్రింహల్-వర్గాస్ లు వివరణ ఇస్తూ ఈ సరికొత్త విధానం అనేది తాము అన్ని ఆలోచించే తమ యూనివర్సిటీలో పెట్టమని ఓ మనిషికి వయసు,జాతి,లింగం మరియు మత విశ్వాసాలు వంటివి ఎలా అయితే నిషేధించబడ్డాయో తాము తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం వాటిని వేగవంతగా బయటకు తీసుకువస్తుంది అన్నట్టుగా సమర్ధించుకున్నారు.అంతే కాకుండా దీనిలో వేరే దురుద్దేశం ఏమీ లేదని రాబోయే భవిష్యత్తు తరాలలో వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అమలు లోకి తీసుకొచ్చామని మరో విధంగా కూడా సమర్ధించుకునే ప్రయత్నం చేసారు.ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సరికొత్త విధానం అన్నది యూఎస్ లో సంచలనంగా మారిపోయింది.