మరో టీజర్ తో వచ్చేస్తున్న వర్మా, నాగ్ ….

Thursday, May 3rd, 2018, 09:21:40 PM IST

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌, కింగ్ నాగార్జున కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం ఆఫీస‌ర్‌. 28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వ‌ర్మ‌- నాగ్ కాంబినేష‌న్ ఇప్పుడు ఆఫీస‌ర్ చిత్రంతో మ‌రో అద్భుతం క్రియేట్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. యాక్ష‌న్ డ్రామాగా ఆఫీస‌ర్ చిత్రం తెర‌కెక్క‌గా, మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలని చూస్తుంటే వ‌ర్మ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కిడ్నాప్ అయిన పాపని రక్షించే నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్టు అర్ధ‌మైంది.. మైరా స‌రీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. కంపెనీ బేన‌ర్‌పై వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రేపు సాయంత్రం 6గం.ల‌కి చిత్రం నుండి మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాలని భావిస్తున్నారు మూవీ మేక‌ర్స్‌. రామ్ గోపాల్ వ‌ర్మ‌, నాగార్జున కాంబినేష‌న్‌లో వచ్చిన శివ‌, గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో ఎన్ని తరాలు మారినా ఎన్ని సినిమాలు వచ్చినా వీరిద్దరి కాంబినేషన్ మాత్రం పక్కా హిట్ అవుతుందని, అంటే కాకుండా నాగ్ వర్మ అభిమానులకు కూడా ఆఫీస‌ర్ చిత్రంపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments