సంచలన వార్త : శ్రీరెడ్డికి రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చా….పవన్ ని నేనే అలా అనమన్నాను!

Thursday, April 19th, 2018, 04:30:44 PM IST


కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం తనకు నచ్చిందని, నిర్భయంగా ఆమె చేసిన అర్ధ నగ్న ప్రదర్శన సమయంలో ఆ అమ్మాయిలో బెరుకు కనపడలేదని, అందుకే తాను శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చానని వర్మ అన్నారు. అంతే కాదు నేడు ఈ విషయమై ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియోలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుటుంబంతో ఆయన కుమారుడు అభిరాంతో, శ్రీరెడ్డికి ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తాను ముందుకు వచ్చానని చెప్పారు. ఆ సమయంలో తనకు ఐదు కోట్లు సురేశ్ కుటుంబం నుంచి వచ్చేలా చేస్తానని అయితే ఆ సెటిల్‌మెంట్‌కు శ్రీరెడ్డి అంగీకరించలేదని అన్నారు. వాస్తవానికి సురేశ్‌కు ఈ విషయాలేవి తెలియవన్నారు. శ్రీరెడ్డి అంత డబ్బు నిరాకరించడం వెనక, ఆమె చేస్తున్న ఉద్యమమే కారణమన్నారు.

తను డబ్బులు తీసుకుంటే, తన పోరాటానికి అర్థం ఉండదని, తన సుఖం తాను చూసుకోలేనని శ్రీరెడ్డి తనతో చెప్పిందని వర్మ అన్నారు. అంత డబ్బు శ్రీరెడ్డి వద్దని చెప్పడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎన్నో కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు చేస్తున్న పోరాటాన్ని తప్పుదోవ పట్టించలేనని శ్రీరెడ్డి చెప్పిందన్నారు. అంతే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించడం వెనక ఉన్నది తానేనని వర్మ ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలోకి వెళ్లడానికే అలా అనమని చెప్పానన్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత తనదే అన్నారు. రాజకీయ నేతలు చేసే పనే తాను శ్రీరెడ్డికి సూచించానన్నారు.

కేసీఆర్, పవన్ కూడా చాలా సార్లు విమర్శించుకున్నారని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారన్నారు. పెద్ద వాళ్లను తీవ్ర స్థాయిలో విమర్శిస్తేనే అందరి దృష్టి పడుతుందన్నారు. అలాగే కత్తి మహేశ్ కూడా పవన్‌ను విమర్శించే అంత పాపులర్ అయ్యాడని చెప్పానన్నారు. తాను చెప్పినట్టు చేస్తే శ్రీరెడ్డి ఉద్యమంపై కూడా అందరి దృష్టి పడుతుందని చెప్పానని, ఈ విషయంలో శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్ కల్యాణ్‌కు, అతని అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా అన్నారు. కాగా ప్రస్తుతం ఆయన విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments