బిగ్ బ్రేకింగ్ : కోడెల రీపోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు!

Thursday, September 19th, 2019, 09:32:21 AM IST

గత రెండు రోజుల క్రితమే టీడీపీ సీనియర్ కీలక నేత మరియు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మ హత్యా వార్త మొత్తం ఏపీ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి లోను చేసింది.అయినా సరే ఇదే విషయాన్ని పట్టుకొని అటు తెలుగుదేశం మరియు వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.అయితే కోడెల ఆత్మహత్య పట్ల ఎన్నో అనుమానాలు అందరూ రేకెత్తిస్తుండగా ఇప్పుడు దానికి సంబందించిన రీపోస్టు మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందట.

ఇందులో వైద్యులు అందించిన సమాచారం ప్రకారం పోలీసులు కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు.కోడెల తన ఇంట్లోనే వైర్ తో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారని డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు.అంతే కాకుండా గత కోడెలలో సూసైడల్ టెండెన్సిస్ ఉందని దాని వల్లే అంతకు ముందు కూడా ఆయన ఆత్మ హత్యా యత్నం చేసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.మొత్తానికి ఇది పక్కా ఆత్మ హత్య అని వైద్యులు నిర్ధారించారు.మరి ఇక నుంచి అయినా మన రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఇంకా లాగకుండా ఉంటారో లేదో చూడాలి.