స్పైడర్ ఫస్ట్ రివ్యూ… మహేశ్ మెస్మరైజ్ చేస్తాడంట!

Tuesday, September 26th, 2017, 05:50:57 PM IST


సూపర్ స్టార్ మహేశ్ స్పైడర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి మరొక్క రోజే టైం ఉంది. సరికొత్త కథాంశం తో హాలీవుడ్ స్టాండర్డ్ లో వస్తున్న స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. బాలీవుడ్ క్రిటిక్, సెన్సార్ సభ్యుడు ఉమర్ చందు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. స్పైడర్ సినిమా మంచి థ్రిల్లింగ్ మూవీ, అని కనిపించకుండా హత్యలు చేసే విలన్ ని హీరో తన తెలివితో ఎలా ఐడెంటిఫై చేసాడు అనేది సింపుల్ గా కథ అని చెప్పాడు. అయితే ఇందులో అద్బుతమైన అడ్వంచర్ మలుపులు, థ్రిల్ ఫీల్ అయ్యే అంశాలు చాలా ఉంటాయని చెప్పాడు. మహేశ్ యాక్టింగ్ స్కిల్ల్స్ అద్బుతం అని కూడా పోగిడేసాడు. సినిమా చాల ఇంటరెస్టింగ్ గా ఉంటుందని, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఇక విలన్ గా ఎస్.జే. సూర్య, హీరోయిన్ రకుల్ యాక్టింగ్ కూడా సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పాడు. స్పైడర్ సినిమాకి తను ఇచ్చే రేటింగ్ 3.5 అని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. ఇప్పుడు ఈ రివ్యూ చూస్తున్న మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. మహేశ్ కి హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు.

Comments