షకీలా ‘శీలవతి’ కి సెన్సార్ కష్టాలు!

Wednesday, June 13th, 2018, 11:06:10 AM IST

ప్రముఖ శృంగార మలయాళ తార షకీలా పేరు తెలియని వారుండరు అంటే నమ్మకతప్పదు. ఒకానొక సమయంలో ఆమె నటించిన సినిమాలు అక్కడి పెద్ద హీరోలయిన మమ్ముట్టి, మోహన్లాల్ వంటి హీరోల సినిమాల రేంజ్ లో కలెక్షన్లు సంపాదించి సక్సెస్ అయ్యాయంటే ఆమెకున్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి చిత్రాలతో పాటు అడపాదప కొన్ని మామూలు చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పటివరకు మొత్తం 249 చిత్రాల్లో నటించిన షకీలా ప్రస్తుతం తన 250వ చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం పేరు శీలవతి. కొన్నాళ్ల క్రితం విడుదలయిన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన వంచింది. ఇక ప్రస్తుతం చిత్ర విడుదల సమయం దగ్గరపడుతుండటంతో సెన్సార్ కు పంపారు దర్శక నిర్మాతలు. అయితే టైటిల్ అభ్యన్తరకరంగా ఉందని, కాబట్టి చిత్ర పేరు మారిస్తేతప్ప చిత్రాన్ని సెన్సార్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డు మెంబర్లు నిలిపివేశారు.

దీనితో చిత్రంపై స్పందించిన షకీలా, సినిమాపేరు శీలవతి అనేది కథ ప్రకారం పెట్టడం జరిగిందని, సినిమా చూడకుండానే అందులో ఏదోదో ఉందని ఊహించుకుని ఇలా సెన్సార్ చేయకుండా ఆపడం సరైనది కాదని ఆమె అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా పేరుని ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదని, ఇప్పటికే మా సినిమా ఈ పేరుతో జనాల్లో రిజిస్టర్ అయిపోయిదని అన్నారు. కావున తమ సినిమాపట్ల సుహృద్భావముతో వ్యవహరించి సెన్సార్ నిర్వహించాలని, కావాలంటే చిత్రాన్ని చూసి అప్పుడు అభ్యన్తరాలేమైనా ఉంటే చెప్పమని ఆమె విజ్ఞప్తి చేసారు. అంతే కాదు ఈ విషయమై ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, ప్రముఖులు జోక్యం చేసుకుని తమకు సాయం చేయాలనీ ఆమె కోరారు….

  •  
  •  
  •  
  •  

Comments