అజ్ఞాతవాసికి ఏడు షోల ఎఫెక్ట్?

Friday, January 12th, 2018, 11:40:34 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి ఈ నెల 10 న విడుదలయిన విషయం తెలిసిందే. మొదట కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నఈ చిత్రం ఇప్పుడు పూర్తిగా డివైడ్ టాక్ తో రన్ అవుతోంది. పవన్, మరియు త్రివిక్రమ్ ల కెరీర్ లోనే అత్యంత ఘోర పరాజయంగా నమోదయ్యా అవకాశం ఉందటున్నారు విశ్లేషకులు. అన్నిటికి మించి దాదాపుగా విడుదలయిన అన్ని చోట్లా కలెక్షన్స్ ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే అసలు వచ్చిన పెద్ద చిక్కల్లా ఏంటంటే ఏడు షోలు అనుమతి తీసుకోవటమే. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు కాస్త యావరేజ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు చూడటానికి ఎగబడతారు, పవన్ ఫాన్స్ ఈ చిత్రం సూప్ హిట్ అనే నమ్మకం పెట్టుకున్నారు, అది జరిగి ఉంటే నాలుగు కాదు ఏడు షోలు మొత్తం హౌసేఫుల్ అయి దాదాపు గా బాహుబలి రికార్డులు బద్దలయ్యేవని అనుకున్నారు. కానీ ఫలితం రివర్స్ లో ఉండడంతో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

అసలు నెగటివ్ టాక్ వచ్చిన చిత్రానికి ఒకటి లేక రెండు షోలు ఫుల్ అవడం కష్టమని, మరి అలాంటిది ఏడు షోలు ఎలా రన్ అవుతాయి అని భయపడుతున్నారు. అందులోనూ మామూలు సమయాల్లోనే తీరిక దొరికితే తప్ప కొందరు సినిమాని హాల్ కి వెళ్లి చూడరు. అటువంటిది ఇప్పుడు అర్దరాత్రి అదికూడా వచ్చిన ఈ టాక్ ని బట్టి చూస్తే ఆ సమయంలో సినిమాని థియేటర్ కి వెళ్లి చూసేంత తీరిక గాని ఓపిక గాని ఇప్పటి ప్రేక్షకుడికి లేదనే చెప్పుకోవాలి. యూనిట్ సినిమా మీద ఏ నమ్మకం, ధైర్యంతో ఏడు షోల అనుమతి తీసుకుందో వారికే తెలియాలని ప్రేక్షకులు మండి పడుతున్నారు. ఎలాగూ పండుగ కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలో ఒక మూడు నాలుగు రోజులు టికెట్ లు బుకింగ్ లు చేసుకున్న వారివల్ల కొంత మేర కలెక్షన్స్ రాబట్టినా ఆతర్వాతే అసలు పరీక్ష మొదలవుతుందని చిత్రాన్ని కొన్న ఎక్సిబిటర్ లు బయ్యర్ లు బెంబేలెతుతున్నారు. అందులోనూ నేడు బాలయ్య జైసింహ, సూర్య గ్యాంగ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా ఆ ఫలితం కూడా అజ్ఞాతవాసి పై పడుతుంది. ఏది ఏమైనప్పటికి వస్తున్న కలెక్షన్స్ రిపోర్టులని బట్టి చూస్తే పవన్ సినిమాకి రానున్నది గడ్డు కాలమే.