ఆనాడు అలా చేయడం వలనే.. ఇప్పుడు మనకు ఇలా..!

Tuesday, January 12th, 2016, 05:40:56 PM IST


చలికాలం వచ్చింది అంటే చాలా మందిని ఎలర్జీ వస్తుంది. ఆ ఎలర్జీ కారణంగా.. తుమ్ములు వస్తాయి. చికాకు తెప్పిస్తుంది. ఇది కేవలం ఒక్కసారితో పొయ్యేది కాదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది. మనలో ఉన్న జన్యువులే అందుకు కారణం అంటున్నారు పరిశోధకులు. మరి కొందరికైతే.. ఏ చిన్న డస్ట్ తగిలినా.. ఇక అంతే సంగతులు.. తుమ్ములే తుమ్ములు. విపరీతంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే, జర్మనీకి చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధన జరుపుతున్నారు. వీరి పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం యూరప్ ఖండంలో అభివృద్ధి చెందుతున్న నియాండర్ థార్స్ మానవులు , డెనిసోనర్స్ అనే ఆదిమజాతి మానవులు కలిసే జీవించేవారట. అలా కలిసి జీవించే సమయంలో నియాండర్ థార్స్, డెనిసోనర్స్ మానవుల మధ్య లైంగికపరమైన సంబంధాలు ఏర్పడ్డాయని.. ఇలా క్రాస్ సంకరీకరణం వలన జన్యువులలో మార్పులు సంభవించినట్టు జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.