దారుణం : గర్భిణీని లైంగికంగా వేధించిన దుర్మార్గులు…

Saturday, December 14th, 2019, 03:58:13 PM IST

మన ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలను మొదలుకొని, వృద్ధ మహిళల వరకు కూడా ఈ దారుణమైన ఘటనలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కాగా తాజాగా మరొక మహిళపై కూడా నలుగురు మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే… కర్ణాటక రాష్ట్రంలోని కడలూరు సమీపంలోని పుడుపాళ్యం ప్రాంతానికి చెందిన ఒక 5 నెలల గర్భిణీ మహిళా, స్థానికంగా ఉన్నటువంటి సినిమా థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లగా, అక్కడే ఉన్న నలుగురు మృగాళ్లు ఆమెపై లైంగికంగా వేధించడం ప్రారంభించారు.

అయితే ఆ మృగాలపై సదరు మహిళా ఎదురు తిరగడంతో వాళ్ళు అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే సినిమా పూర్తయ్యాక కూడా వారు థియేటర్ బయట ఎదురు చూస్తూ, బలవంతంగా ఆ మహిళను కారు ఎక్కించడానికి ప్రయత్నించారు. కాగా వారి నుండి తప్పించుకున్న మహిళా స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.