రోబో 2.0 రిలీజ్ మరోసారి వాయిదా పడిందా ?

Saturday, June 9th, 2018, 11:25:43 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటించిన కాలా చిత్రం ఇటీవలే విడుదలై మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తరువాత రజని కాంత్ నటించిన రోబో 2. 0 విడుదల అవుతుందని అనుకుంటే .. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి జూన్ లోనే విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ, కాలా విడుదల వాయిదాలు పడి చివరికి జూన్ 7న విడుదల కావడంతో 2. 0 విడుదల ఆగస్టు లో అనుకున్నారట .. కానీ అప్పటికి కూడా ఈ పనులు పూర్తీ కాకపోవడంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే సూపర్ స్టార్ రజని పుట్టిన రోజు డిసెంబర్ 12న విడుదల చేస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments