ఇంటినుండి బయటికి వచ్చేముందు పోలీసులు వీరికి ఇస్తున్న పనిష్మెంట్ చూడండి.

Tuesday, March 24th, 2020, 12:38:01 PM IST

కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. రూల్స్ బ్రేక్ చేసిన వారిని శిక్షించాలని నిర్ణయం కూడా తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారిని పెడ చెవిన పెట్టినందుకు అమెరికా, ఇటలీ, స్పెయిన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. అయితే అయితే భారత్ లో మాత్రం లాక్ డౌన్ నీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇంటినుండి బయటికి వస్తున్న వాహనదారులకు పోలీసులు తగిన బుద్ది చెబుతున్నారు. షాద్ నగర్ లో బయటికి వచ్చిన వాహనదారులను గుంజిళ్ళు తీయించారు పోలీసులు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా పోలీసులు వాహనదారుల కు బుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు వాహనదారులకు వేసిన శిక్షలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.