సామ్‌ని వెంటాడుతున్న షాడో!

Tuesday, June 5th, 2018, 03:06:07 PM IST

అందాల క‌థానాయిక స‌మంత అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర‌వాత స‌మంత కెరీర్ స్కైని ట‌చ్ చేస్తోంది. రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు… వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో హ్యాట్రిక్ నాయిక‌గా వెలిగిపోతోంది. ఇదే హుషారులో ప్ర‌స్తుతం సామ్‌ ఇత‌ర‌త్రా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో స‌మంత త‌న ఎక్స్ ల‌వ్ గురించి ప్ర‌స్థావించి షాకిచ్చే నిజం చెప్పింది.

అది కూడా మ‌హాన‌టి సావిత్రి అనుభ‌వంతో ముడిపెట్టి.. తాను ఒకానొక భ‌యాన‌క స‌న్నివేశం నుంచి బ‌య‌టప‌డ‌గ‌లిగాన‌ని స‌మంత తెలిపింది. అస‌లింత‌కీ ఏమా హారిబుల్ స‌న్నివేశం అంటే… గ‌తంలో తాను ఒకరిని ప్రేమించాన‌ని .. అయితే ఆ ప్రేమ‌లో నిజాయితీ లేద‌ని గ్ర‌హించి దూరంగా వెళ్లిపోయాన‌ని సామ్ చెప్పింది. ఒక‌వేళ తాను అత‌డినే న‌మ్మి ఉంటే .. మ‌హాన‌టి సావిత్రి గ‌తే త‌న‌కు ప‌ట్టేద‌న్న అర్థం వ‌చ్చేలా సమంత మాట్లాడ‌డం సంచ‌ల‌న‌మైంది. అప్ప‌టికే పెళ్ల‌యిన జెమినీ గ‌ణేష‌న్‌ని పెళ్లాడి సావిత్రి ఎలాంటి ఇబ్బందులు ప‌డిందో తెర‌పై చూశామ‌ని సామ్ వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇదంతా ఎవ‌రి గురించో తెలిసిందే. సామ్ కెరీర్ ఆరంభ‌మే హీరో సిద్ధార్థ్‌ను ప్రేమించి అటుపై బ్రేక‌ప్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. త‌న‌తో బ్రేక‌ప్ అయినా.. అక్కినేని కోడ‌లు హోదాలో ఉన్నా.. ఇంకా ఆ అనుభ‌వం సామ్‌ని షాడోలా వెంటాడుతూనే ఉంది.