ర‌విప్ర‌కాష్ కి అండగా నిలుస్తున్న‌దెవ‌రు?

Saturday, June 8th, 2019, 03:11:29 PM IST

టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ అరెస్ట్‌కు అంతా సిద్ధం అయిన‌ట్టేనా?. ఈ శ‌నివార‌మే ర‌విప్ర‌కాష్‌ని అరెస్ట్ చేయ‌బోత‌న్నారా? అంటే అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. నెల రోజులుగా అజ్ఞాతంలో వున్న ర‌విప్ర‌కాష్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ పోలీసుల ఎదుట హాజ‌రై షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ రోజు నుంచి హైద‌రాబాద్ పోలీసులు ర‌విప్ర‌కాష్‌రు షాకుల మీద షాకులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. గంట‌ల కొద్ది విచారిస్తున్నా ర‌విప్ర‌కాష్ మాత్రం పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. శుక్ర‌వారం ఏడు గంట‌ల పాటు విచారించినా త‌న‌కు తోచించిది చెబుతూ ద‌ర్యాప్తును ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఎంత‌గా విచారించినా ర‌విప్ర‌కాష్ బెద‌ర‌డం లేద‌ని, అత‌నిలో ఎలాంటి భ‌యం క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే ర‌విప్ర‌కాష్ మొండిగా వాదించ‌డం వెనుక అత‌నికి బీజేపీ కీల‌క నేత అండ వుంద‌ని, ఆ అండ చూసుకునే త‌ను రెచ్చిపోతున్నాడ‌ని ప‌లువురు అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో బీజేపీ ఛీఫ్ అమిత్ షాతో ర‌విప్ర‌కాష్ చ‌నువుగా వున్న ఫొటోలు ఇటీవ‌ల బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో ర‌విప్ర‌కాష్ మొండి వాద‌న‌కు కార‌ణం బీజేపీ అండ‌దండ‌లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. వారి అండ వుంద‌నే తెలంగాణ ప్ర‌భుత్వంపై ర‌విప్ర‌కాష్ హ‌ద్దులు దాటి మాట్లాడుతున్నార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ర‌విప్ర‌కాష్ మొండి వైఖ‌రిని తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఈ రోజు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం వుంది.