సిక్సర్లు కొట్టడంలో అతడే మొనగాడు!

Tuesday, July 30th, 2013, 03:01:41 PM IST


పాకిస్తాన్ హ్యాండ్సమ్ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. సిక్సర్లు కొట్టేందుకు బ్యాటింగ్ చేసే అఫ్రిదీ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసుకున్నాడు. బంతిని బలంగా కొట్టడంలో మనోడి తర్వాతే ఎవరైనా.. క్రికెట్ బాల్ ను విచక్షణారహితంగా శిక్షించడం అఫ్రిదీకి అలవాటు. 16 ఏళ్ల ప్రాయంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అఫ్రిదీ.. తొలి మ్యాచులోనే భారీ సిక్సర్లతో బోణీ చేసాడు. ఇక అప్పట్నుంచి ప్రతీ మ్యాచులోనూ సిక్సర్లే టార్గెట్ గా బ్యాటింగ్ చేసాడు.

తన సిక్సర్లతో వన్డే క్రికెట్ గతినే మార్చేసాడు బూమ్ బూమ్ అఫ్రిదీ. అప్పటివరకు మ్యాచ్ లో రెండో మూడో సిక్సర్లుండేవి. సచిన్ లాంటి క్రికెటర్ కూడా సిక్సర్ల జోలికి పెద్దగా పోలేదు. అఫ్రిదీ వచ్చిన తర్వాత సిక్సర్లు కొట్టడంలో మిగతా క్రికెటర్లుకూడా ఉత్సాహం చూపారు. అఫ్రీదితో పోటీపడి సనత్ జయసూర్య సిక్సర్లు బాదేవాడు. సౌరవ్ గంగూలీ కూడా సిక్సర్లు కొట్టడంలో దిట్ట.లారా, గేల్ లు కూడా సిక్సర్లు బాదడంలొ మొనగాళ్లే.

ఫార్మాట్ ఏదైనా…మంచినీళ్ల ప్రాయంలో సిక్సర్లు పీకడం అఫ్రిదీకి అలవాటు. ఎంతటి బౌలర్నయినా…వదలడు. ఒక్కసారి అఫ్రిదీ కొట్టే సిక్సర్లు స్టేడియం బటపడతుంటాయి. వన్డే అయినా, టెస్టు అయినా, టీ ట్వంటీ అయినా తన బ్యాటింగ్ స్టయిల్ మారదు. బౌలర్ తలమీదుగా, మిడ్ వికెట్ మీదుగా కొట్టే సిక్సర్లు చూడముచ్చటగా ఉంటాయి.

సిక్సర్లు కొట్టడంలో క్రిస్ గేల్ ది కూడా అందె వేసిన చెయ్యే. గేల్ కూడా బౌలర్ ను లెక్క చేయడదు. భారీ సిక్సర్లతో బెంబేలెత్తిస్తాడు.అవలీలుగా సిక్సర్లు కొట్టడం ఈ లెఫ్టాండర్ నైజం. క్రీజులో నిలబడే…ఆడియన్స్ గ్యాలరీకి బంతిన పంపించడంలో దిట్ట. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఏ బౌలర్ అయినా గేల్ ముందు బలాదూరే.

359 వన్డేలాడిన అఫ్రిదీ 314 సిక్సర్లు బాదాడు. 254 వన్డేలాడిన గేల్ 204 సిక్సర్లతో ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 27 మ్యాచుల్లో 32 సిక్సర్లు కొట్టాడు. గేల్ 97 మ్యాచుల్లో 89 సిక్సర్లు కొట్టాడు. 61 టీ ట్వంటీల్లో అఫ్రిదీ 34 సిక్సర్లు, గేల్ 34 టీట్వంటీల్లో 60 సిక్సర్లు బాదాడు. ఓవరాల్ గా అఫ్రిదీ 400 సిక్సర్ల మార్కును చేరుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలుపుకొని గేల్ 353 సిక్సర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.