మరోసారి తండ్రి అయిన స్టార్ హీరో…?

Sunday, April 22nd, 2018, 01:43:51 PM IST

అభిమానులు త‌మ ఫేవ‌రేట్ హీరోల సినిమా విష‌యాలే కాదు ప‌ర్స‌న‌ల్ విష‌యాలపై కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటారు. పెళ్లి , పిల్ల‌లు వంటి విష‌యాల‌పై ఆరాలు బాగా తీస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ మ‌రోసారి తండ్రి కాబోతున్నాడనే విష‌యం క‌న్‌ఫాం చేశారు. షాహిద్ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ముద్దుల త‌న‌యు మిషా ప‌క్క‌న బిగ్ సిస్ట‌ర్ అనే అక్ష‌రాలు, బెలూన్‌లతో కూడిన ఫోటో షేర్ చేశారు. అంటే మిషా త్వ‌ర‌లో అక్క ప్ర‌మోష‌న్ అందుకోనుండ‌గా, షాహిద్ తండ్రి కాబోతున్నాడ‌ని అంటున్నారు. షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్ దంపతులకు ఆగస్ట్ 26, 2016 సాయంత్రం 7:56 ని.లకు మిషా కపూర్ అనే పండంటి బిడ్డ తొలి సంతానంగా జన్మించిన సంగతి తెలిసిందే. విదేశాల‌లో మిషా బ‌ర్త్‌డే వేడుక‌లని ప‌లు మార్లు జ‌రిపిన షాహిద్, చిన్నారి వేడుక‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల‌ని ఆనందింప‌జేశాడు. ఇప్పుడు వారింట మ‌రో చిన్నారి అడుగు పెట్ట‌నున్నారు. ఇటీవ‌ల ప‌ద్మావ‌తి చిత్రంతో మెప్పించిన షాహిద్.. శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

❤️

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

  •  
  •  
  •  
  •  

Comments