‘అర్జున్ రెడ్డి’ రీ మేక్ లో షాహిద్ కపూర్

Thursday, April 26th, 2018, 12:04:30 AM IST

విజయ్‌ దేవరకొండను ఓవర్‌నైట్‌ స్టార్‌గా మార్చిన సినిమా అర్జున్‌ రెడ్డి. బోల్డ్‌ సినిమాగా తెరకెక్కి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ రీమేక్‌లో చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్‌రెడ్డి సినిమా దర్శకుడు సందీప్‌ వంగ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో పాత్ర కోసం పలువురు కథానాయకుల పేర్ల పరిశీలనలోకి తీసుకున్న సందీప్‌.. షాహిద్‌ కపూర్ మాత్రమే అర్జున్‌ రెడ్డి పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నారట. ఈ మేరకు షాహిద్‌ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం.

జాతీయ వార్తా సంస్థ ముంబై మిర్రర్‌ కథనం ప్రకారం.. అర్జున్‌రెడ్డి పాత్ర పోషించేందుకు షాహిద్‌ కపూర్‌ సుముఖంగా ఉన్నారట. హీరోయిన్‌, ఇతర పాత్రల ఎంపిక జరిగిన తర్వాత జులై నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. తన నటనతో అర్జున్‌ రెడ్డి పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు పొందాడు విజయ్‌ దేవరకొండ. మరి ఈ పాత్రలో షాహిద్‌ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments