పద్మావత్ హీరోల మధ్య గొడవ నిజమేనా ?

Monday, February 5th, 2018, 04:44:49 PM IST

మల్టి స్టారర్ సినిమాలంటే దర్శకులకు కథ రాసుకోవడం ఒక పెద్ద పనైతే ఇద్దరి హీరోల ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా ఒకే లెవెల్లో చూపించడం మరొక ఎత్తని అందరికి తెలిసిన విషయమే. అందుకే మల్టి స్టారర్ కథలంటే దర్శకులు చాలా వరకు వెనకడుగు వేస్తుంటారు. ఇక రీసెంట్ గా పద్మావత్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే అందులో నటించిన ఇద్దరు హీరోలు రన్ వీర్ సింగ్ – షాహిద్ కపూర్ నటించిన తీరుకు మంచి గుర్తింపు దక్కింది.

అయితే ఈ హీరోల మధ్య ఆ సినిమా షూటింగ్ లో కొంచెం విభేదాలు వచ్చాయని బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇక దానికి తోడు రీసెంట్ గా వీరు ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముందుగా రన్ వీర్ షాహిద్ నటించిన కమీనే సినిమాపై ఒక కామెంట్ చేశాడు. ఆ సినిమాలో తాను నటించి ఉంటే కొంచెం బెటర్ గా నటించేవాన్ని అని చెప్పడంతో షాహిద్ కూడా పద్మావత్ లో రన్ వీర్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర తాను చేసి ఉంటే ఇంకా బాగా చేసేవాన్ని అని కౌంటర్ వేశాడు. దీంతో కొందరు సినీ ప్రముఖులు ఈ తరహా కౌంటర్లువ్ మంచివి కావని చెబుతున్నారు.