షారుఖ్ ముద్దుల కొడుకు ఏం చేశాడో చూడండి..!!

Tuesday, January 31st, 2017, 08:10:30 PM IST

sharuk-with-his-son
షారుఖ్ బిజీగా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నాడు.ఇంటర్వ్యూ మధ్యలో ఉండగా షారుక్ ముద్దుల కొడుకుఅబ్రామ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొనేందుకు షారుఖ్ తోపాటు అబ్రామ్ కూడా వచ్చాడు. ఇంటర్వ్యూ జరుగుతుండగా తన తండ్రి వద్దకు బిరబిరా వచ్చి..డాడీ బొటన వేలు విరిగింది చూడండి అంటూ తన చిట్టి వేలుని తండ్రికి చూపాడు. షారుఖ్ అబ్రామ్ ని దగ్గరకు తీసుకుని బొటనవేలికి ముద్దు పెట్టి.. ఇప్పుడు తగ్గిందా నొప్పి అంటూ అడిగాడు.

తండ్రీకొడుకుల మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.షారుఖ్ నటించిన రయీస్ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఈ చిత్ర ప్రమోషన్ లో షారుఖ్ బిజీగా పాల్గొంటున్నాడు.