ఏది దాచుకోలేదట ..అన్ని చెప్పేసిందట షకీలా ?

Sunday, July 22nd, 2018, 10:55:28 AM IST

షకీలా .. సౌత్ సినిమా పరిశ్రమలో ఓ పెద్ద సంచలనం. 90 వ దశకంలో ఆమె సినిమా వస్తుందంటే చాలు .. స్టార్ హీరోల సినిమాల విడుదలలు ఆగిపోయేవి. సౌత్ బాక్స్ ఆఫీస్ కు షకీలా అంటే దడ !! శృంగార తారాగా షకీలా క్రియేట్ చేసిన సంచలనాం అంతా ఇంతా కాదు. ఇండియన్ పోర్న్ స్టార్ గా టర్న్ తీసుకున్న షకీలా జీవితం పూల పాన్పు కాదు .. ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ రేంజ్ కి ఎదిగింది. ప్రస్తుతం షకీలా బయోపిక్ హిందీలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షకీలా పేరుతొ తెరకెక్కే ఈ సినిమాలో బాలీవుడ్ భామ రిచా చద్దా నటిస్తుంది. ఈ సినిమాకోసం షకీలా తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు చెప్పిందట .. ఏ విషయాన్నీ దాచుకోలేదని చెప్పింది. లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ మధ్య షకీలా తన జీవిత కథను పుస్తకంలా తేవాలని చాలా ట్రై చేసింది.. కానీ అది పడనీయలేదు కొందరు, ఎందుకంటే ఆమె జీవితంలో చాలా మంది పెద్ద తలల ఇన్వల్వెమెంట్ ఉందన్నది పచ్చి నిజం. మరి ఇప్పుడు షకీలా బయోపిక్ సినిమాగా వస్తుందంటే ఇంకెన్ని సంచలనాలు రేపుతోందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments